పురాతన శివాలయంలో బయటపడిన 22 పంచలోహ విగ్రహాలు

సోమవారం, 17 ఏప్రియల్ 2023 (10:10 IST)
22 idols
తమిళనాడులోని పురాతన శివాలయంలో త్రవ్వకాలలో 22 పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. మైలాడుదురై జిల్లా, శీర్గాలిలోని చటగ్నాథాన్ ఆలయంలో 30 సంవత్సరాలకు పైగా కుంభాభిషేకం నిర్వహించలేదు. తాజాగా ఆ ఆలయ కుంభాభిషేకం పనులు జరుగుతున్నాయి. 
 
ఇందులో భాగంగా త్రవ్వకాలలో, ఆలయం లోపల నియమించబడిన యాగశాల ప్రాంతం కనుగొనబడింది. ఇది 22 దేవతా విగ్రహాలను వెలికితీసేందుకు దారితీసింది. 
 
ఐదు లోహాలతో తయారు చేయబడిన, రెండు అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహాలు కనుగొనడం జరిగింది. ఇంకా తవ్వకాల్లో వందలాది రాగి కడ్డీలు, ఇతర కళాఖండాలు కూడా లభించాయి. ఈ విగ్రహాలకు సంబంధించి పురావస్తు శాఖకు సమాచారం అందించడం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు