వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ అన్నదాతలు 11 నెలల నుండి ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ-హర్యానా బోర్డర్ టిక్రీకి సమీపంలో ముగ్గురు మహిళా రైతులపై నుండి వేగంగా ట్రక్కు దూసుకెళ్లడంతో వారు చనిపోయారు. ఆటో కోసం ఎదురుచూస్తూ.. డివైడర్‌పై కూర్చొగా.. ఆ ట్రక్కు వేగంగా వారు పైకి దూసుకువచ్చింది.