తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట కలెక్టర్ స్థానిక రైతులకు ఓ హెచ్చరిక చేశారు. ముఖ్యంగా, యాసంగిలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో ఒక్కఎకరా వరిసాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఆదేశించారు.
యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై జిల్లా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, విత్తన డీలర్లలతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహాకారంతో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.