కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - ఏడుగురు దుర్మరణం

శుక్రవారం, 3 జూన్ 2022 (10:26 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కమలాపురంలో వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు జీపును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి రలించారు. ప్రైవేటు బస్సు గోవా నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు