ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ మాజీ సభ్యుడు చేసిన పనిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తన కుమారుడు అకాల మరణం చెందడంతో వితంతువైన తన కోడలికి రెండో పెళ్లి చేశారు. తన కొడుకు అనారోగ్యంతో చనిపోగా ఒంటరి జీవితం సాగిస్తున్న కోడలికి తండ్రి స్థానంలో నిలిచి మరో వ్యక్తితో వివాహం జరిపించారు.