అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం రెడ్ జోన్లలో మద్యం విక్రయాలకు నో చెప్పింది. విజయవాడలో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్నందున నగరంలో మద్యం షాపులు తెరుచుకోలేదు.
ప్రకటనలో పేర్కొన్న నంబరుకు ఫోన్ చేసి ఏ బ్రాండ్ కావాలో చెప్తే.. రేటెంతో చెప్పేస్తారు. గూగుల్ పే ద్వారా సగం ధర చెల్లిస్తే, మిగతా మొత్తం డెలివరీ సమయంలో చెల్లించొచ్చు. గూగుల్ పే చేసి లొకేషన్ పంపిస్తే మందు బాటిల్ ఇంటికొచ్చి చేరుతుంది.
ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులైన మందుబాబులను టార్గెట్ చేస్తున్నారు. ఆంక్షలున్నా మద్యం దొరుకుతోందనీ, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే వస్తోందని టెంప్టయ్యారో.. మీరు మోసపోయునట్లే!