ధనం, కామంతో ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నానంటూ నకిలీ ఐడీలు, అపాయింట్ మెంట్ లెటర్లు ఉపయోగించి.. తనకు పెద్ద మొత్తంలో జీతం వచ్చేదని నమ్మబలికేవాడు.
అతడి ఫోన్ డేటాను పరిశీలించిన పోలీసులు షాకయ్యారు. మేడమ్ ఢిల్లీ, మేడమ్ యూపీ, మేడమ్ అసోం అంటూ తాను పెళ్లి చేసుకున్న మహిళల పేర్లను ఫోన్ లో ఫీడ్ చేసుకున్నాడు. ఇక, పోలీసులు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పెళ్లి చేసుకోవడం, వారితో కొన్నిరోజుల పాటు తన లైంగిక అవసరాలు తీర్చుకోవడం, ఆపై నగలు, డబ్బుతో పరారవడం అతడి నైజం. 40 ఏళ్లకు పైబడిన ఒంటరి మహిళలు, వితంతు, విడాకులు తీసుకున్న వారినే టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డాడని.. ఇలా 27 మందిని పెళ్లాడాడని చెప్పారు.