కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోలేదు. ముఖ్యంగా, పునీత్ మామ (భార్య తండ్రి) రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. పునీత్ మృతి తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటురావడంతో కన్నుమూశారు. ఆయనకు వయసు 78 యేళ్లు.