అతిపెద్ద నాగుపాము ముంబైలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కల్యాణ్ ప్రాంతంలోని గోద్రేజ్ హిల్ పరిసరాల్లో ఉన్న శనీశ్వరుడి మందిరం వెనకాల శనివారం జూలై-21 పొడువైన తాచు పాము కలకలం సృష్టించింది. ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉదయం పూట భక్తులు మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా నాగుపామును చూసి భయాందోళనకు గురయ్యారు.
వారి అరుపులతో పాము మందిరంలోని గార్డెన్‌లోకి చొరబడింది. సాక్షాత్తు భగవంతుడే కనిపించాడంటూ కొంతమంది భక్తులు పూజలు, భజనలు చేశారు. కేతన్ పాటిల్ అనే యువకుడు సర్పమిత్ర దత్తా బెంబేకు సమాచారమివ్వడంతో ఆయన వచ్చి పామును పట్టుకుని సంచిలో బంధించారు.