అయితే, ఈ లాక్‌డౌన్ ఓ మహిళకు కష్టాలు తెచ్చిపెట్టగా, ఆమె భర్త మాత్రం మరో పెళ్లి చేసుకునేందుకు దోహదపడింది. లాక్‌డౌన్ కారణంగా పుట్టింటిలో భార్య చిక్కుకుని పోయింది. అయితే, భార్య కాపురానికి రావట్లేదని ఆరోపిస్తూ ఆమె భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
కొన్నిరోజుల కిందటే ఆమె పుట్టింటికి వెళ్లగా, ఆపై లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ఆమె పుట్టింట్లోనే ఉండిపోవాల్సి నిర్బంధ పరిస్థితి వచ్చింది. అయితే ధీరజ్ కుమార్ అసహనానికి లోనై, భార్యను వెంటనే వచ్చేయాలని అనేకమార్లు ఫోన్ చేశాడు.
కానీ, ఆమె వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ... వచ్చేందుకు వాహనాలు లేకపోవడం, పోలీసుల ఆంక్షలతో ఆ యువతి భర్త వద్దకు రాలేకపోయింది. దాంతో మరింత అసంతృప్తికి గురైన ధీరజ్ కుమార్ తన భార్యపై కోపంతో మాజీ ప్రియురాలి మెళ్లో తాళికట్టేశాడు.