కొన్నిటిని మాత్రమే గంగలో కలిపి, మిగిలిన అస్థికలను నదీపరీవాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి, దానిపై ఓ మొక్కను నాటాలని మంత్రి తెలిపారు. ఇందుకుగాను పురోహితులు, హిందూ ఆధ్యాత్మికవేత్తలు కృషి చేయాలని.. ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు.
మరోవైపు గంగాప్రక్షాళన ప్రాజెక్ట్ కాదు. మన పాపానికి ప్రాయశ్చిత్తం. ఇన్నేళ్లు దాని అస్థిత్వాన్ని కాపాడుకోలేకపోయినందుకు సిగ్గుపడాలని గత ప్రభుత్వాల తప్పిదాన్ని కేంద్ర మంత్రి ఉమాభారతి ఎత్తిచూపారు. గంగా ప్రక్షాళనతో మోక్ష మార్గాన్ని చూపిస్తామని ప్రకటించారు. అయితే కాగ్ మాత్రం గంగ ప్రక్షాళనలో కేంద్రం ప్రభుత్వం నిధులను సక్రమంగా ఉపయోగించుకోవడంలో విఫలమైందని నివేదికలో తెలిపింది.