ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌పై గోవా ముఖ్యమంత్రి భార్య సులక్షణ సావంత్ తేరుకోలేని షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన కోర్టు.. సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీచేసింది. పైగా, జనవరి పదో తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.