దీపావళి సందర్భంగా పెట్రో ధరలపై వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయించింది. తగ్గింపు ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి.
జనవరి నుంచి మార్చి వరకు పెట్రోలు రేట్లు పెంచుకుంటూ పోయిన చమురు సంస్థలు బెంగాల్ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్‌లో ధరల పెంపుకు విరామం ఇచ్చాయి. ఆ తర్వాత మే నుంచి జూన్ వరకు తాజాగా అక్టోబరులో ఎడాపెడా రేట్లు పెంచుతూ వస్తున్నాయి.