రక్షణ బడ్జెట్‌ను దేశీ, విదేశీ రక్షణ ఉత్పత్తుల సేకరణ పద్దుగా విభజించామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. నిషేధం విధించిన వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గడువు విధిస్తామని చెప్పారు. నిషేధ ఉత్పత్తుల్లో ఫిరంగి తుపాకులు, రైఫిళ్లు, రవాణా విమానాలు ఉన్నాయి.
ఈ నిర్ణయం భారత రక్షణ పరిశ్రమకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. కొత్త ఉత్పత్తుల్లో సొంత డిజైన్‌తో పాటు అభివృద్ధి సామర్థ్యాలను ఉపయోగించొచ్చు. లేదా సాయుధ దళాల అవసరాలు తీర్చేందుకు డీఆర్‌డీవో రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవచ్చు అని రాజ్‌నాథ్ అన్నారు.