చెన్నైలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం

బుధవారం, 22 జులై 2020 (20:36 IST)
చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీ తరువాత ప్లాస్మా బ్యాంక్ చెన్నైలో రెండవది.

ఒకేసారి ఏడుగురు రక్తదానం చేసేందుకు వసతి. రుా. 2 కోట్లతో ఆధునిక పరికరాలతో ఏర్పాటైన ఈ బ్యాంక్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. విజయభాస్కర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.

ఎస్ ఆర్ ఎం వైద్యకళాశాలలో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు కూడా చేపట్టారు. తాజాగా వ్యాక్సిన్ ను మనుష్యులపై ప్రయెాగించేందుకు అనుమతులు లభించడంతో సోమవారం పరిశోధనలు ప్రారంభించారు. ఈ మేరకు ఎస్ ఆర్ ఎం పరిశోధన కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు