చంద్రయాన్-3లో కీలక పరిణామం... చంద్రుడి కక్ష్యలోకి ఎంట్రీ
శనివారం, 5 ఆగస్టు 2023 (12:56 IST)
చంద్రయాన్-3లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చంద్రయాన్-3 ఇప్పటికే జాబిల్లి దిశగా అత్యధిక దూరం పయనించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోనికి ప్రవేశించనుంది.
శనివారం రాత్రి ఏడు గంటలకు ఇది చంద్రుని కక్ష్యలో ప్రవేశించనుందని ఇస్రో ప్రకటించింది. స్పేస్ క్రాఫ్ట్‌లోని విక్రమ్ ల్యాండర్‌కు అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
విక్రమ్ ల్యాండర్‌ను మరింత అభివృద్ధి చేసి.. చంద్రయాన్ -3తో పంపామని.. శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రయాన్-3 ల్యాండర్స్మూత్తుగా చంద్రుడి ఉపరితలంపై దిగితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.