హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పణలో, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి 'రాజశేఖర్ సుద్మూన్' రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సమర్పకుడు హీరో నవదీప్ సమక్షంలో జరిగింది. అలాగే, ఈ కార్యక్రమానికి హీరో సోహెల్, ప్రొడ్యూజర్ జి సుమంత్ నాయుడు విచ్చేసారు.