ఆయనో మంత్రి కానీ రేప్ కేసులో చిక్కుకున్నాడు. ఇక చేసేది లేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మంత్రి మిస్సింగ్ అంటూ గాలింపు చర్యలు చేపట్టారు. ఇదంతా వివాదాస్పద గుజరాత్ మంత్రి గాయత్రి ప్రజాపతి గురించే. ఓ అత్యాచారం కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీకోర్టునుంచి మార్గదర్శకాలు రావడంతో.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు రెడీ అయిపోయారు.
యూపీలో ప్రతిరోజు ఉదయం గాయిత్రీ ప్రజాపతి మంత్రం ఆలపించే పార్టీ ఒకటి ఉంది'' అంటూ తనదైన శైలిలో ప్రధాని వ్యంగ్యాస్త్రం విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాపతి కనుమరుగు కావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రేప్ కేసు కూడా ఆయన మీద ఉండటం ద్వారా.. దాని నుంచి తప్పించుకోవడానికే అజ్ఞాతానికి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.