పేదల పట్ల మరీ ఇంత క్రూరమా..? ఇంతేనా సీఎం యోగి పాలన అంటే? (Video)

ఠాగూర్

సోమవారం, 30 డిశెంబరు 2024 (09:31 IST)
రైల్వే స్టేషన్ ఫ్లాటారామలపై సేద తీరుతున్న పేదల పట్ల ఆ రైల్వే స్టేషన్ అధికారులు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పేదల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్‌లోని చార్‌బాఘ్ రైల్వే స్టేషన్‌లో గుండెల్ని పిండేసే దారుణ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్లాట్‌ఫామ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై రైల్వే అధికారులు చల్లనీళ్లు చల్లిన చల్లారు. మహిళలు ఇబ్బంది పడుతున్నా, పిల్లలు బోరున విలపిస్తున్నా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
ఎముకలు కొరికే చలిలోనూ నీళ్లు చల్లి వారిని స్టేషన్ సిబ్బంది నిద్రలేపింది. ఈ దుశ్చర్య పట్ల నెటిజన్ల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మనుషులు మరీ ఇంత కర్కశంగా ఎలా తయారయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుభిక్ష పాలన అందుస్తున్నమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ పాలకులు పేదల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి. 

 

పేదల పట్ల మరీ ఇంత క్రూరమా..?

ఉత్తరప్రదేశ్‌లోని చార్‌బాఘ్ రైల్వే స్టేషన్‌లో గుండెల్ని పిండేసే దారుణ ఘటన

ప్లాట్‌ఫామ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై చల్లనీళ్లు చల్లిన అధికారులు

మహిళలు ఇబ్బంది పడుతున్నా, పిల్లలు బోరున విలపిస్తున్నా..

ఎముకలు కొరికే చలిలోనూ నీళ్లు చల్లి… pic.twitter.com/n3cv6qR4IR

— Pulse News (@PulseNewsTelugu) December 29, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు