గత 24 గంటల్లో 29,163 కొత్త కేసులు..449 మరణాలు

మంగళవారం, 17 నవంబరు 2020 (21:42 IST)
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. శీతకాలం, పండుగల వాతావరణం కారణంగా వైరస్ సంక్రమణ వేగవంతమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మాస్కులు ధరించాలని, కొవిడ్-19 నిబంధనలు పాటించాలని ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. వీటన్నింటి మధ్య తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు ఊరట కలిగిస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో 29,163 కొత్త కేసులు వెలుగు చూడటమే అందుకు కారణం. జులై 15 తరవాత 30వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88,74,290 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. 

ఇక, సోమవారం కొవిడ్‌తో 449 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మరణాల సంఖ్య 1,30,519కి చేరింది. క్రియాశీల కేసులు ఐదు లక్షల దిగువన ఉన్నాయి.  రికవరీ రేటు రోజురోజుకూ పెరగడం సానుకూలంగా కనిపిస్తోంది.
 
క్రియాశీల కేసుల సంఖ్య 4,53,401(5.11శాతం) ఉండగా.. ఇప్పటి వరకు 82,90,370(93.42శాతం)మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు.

కాగా, నవంబర్ 16నాటికి దేశవ్యాప్తంగా 12,65,42,907 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..నిన్న ఒక్కరోజే 8,44,382 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు