ఉత్తర భారతానికి పొంచి వున్న ముప్పు.. పంట మొదళ్లు తగలబెడితే..?

మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:48 IST)
చలికాలం ప్రారంభ సమయంలో ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో.. పంట మొదళ్లు తగలబెట్టడం ప్రతి ఏటా ఓ సమస్యగా మారింది. ఈ భీకరమైన పొగతో ఏర్పడే కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతమంతా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ముఖ్యంగా గాలి కాలుష్య కారకాలైన పీఎం స్థాయిలతో పాటు కార్బన్‌ మోనాక్సైడ్‌, మీథేన్‌ వంటి విషవాయువుల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
 
దీంతో ఉత్తర భారత వాసులకు ముప్పు పొంచి వుంది. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం.. తాజా పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశాలున్నాయని వాతావరణ, వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఊపిరితిత్తులపై ప్రభావం చూపే కరోనా వైరస్‌ బాధితులకు ఇది మరింత ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంటుందని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న జనం.. ఇలాంటి ముప్పు పొంచి వుండటంతో తలపట్టుకుంటున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు