ప్రస్తుతం జైన్ చికిత్సకు స్పందిస్తున్నారని, మరో 24 గంటల పాటు జ్వరం, శ్వాస ఇబ్బందులు తలెత్తకుంటే, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలిస్తామని వైద్య బృందాలు వెల్లడించాయి. తొలుత రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన ఆయనను, ఆపై మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు.