గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కలిగి వున్నట్లు బాధితురాలు పట్టుబడటంతో.. 15మందితో కూడిన బృందం ఆమెపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని సంజెలి తాలూకాలోని ఒక గ్రామంలో 35 ఏళ్ల మహిళ స్థానికుల చేతుల్లో దారుణంగా అవమానానికి గురైంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దాహోద్ జిల్లా గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఒక మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ 15 మంది వ్యక్తుల బృందం ఆమెపై దారుణంగా దాడి చేసింది. వారు ఆమె బట్టలు విప్పి, ఆమెపై దాడి చేసి, ఆపై ఆమెను మోటార్ సైకిల్ చక్రానికి కట్టి రోడ్డు వెంట ఈడ్చుకెళ్లారు.