A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

సెల్వి

సోమవారం, 5 మే 2025 (14:53 IST)
A Raja
తమిళనాడులోని మైలాడుదురైలో జరిగిన బహిరంగ సభలో డీఎంకే ఎంపీ ఎ రాజా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం వీచిన బలమైన గాలుల కారణంగా వేదిక దగ్గర ఓవర్ హెడ్ లైట్లు పడిపోయాయి. వేదిపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. స్టేజీ లైట్ ఆయనపై పడబోయింది.
 
ముందుగానే విషయం గుర్తించిన ఆయన క్షణాల్లోనే పక్కకు జరగ్గా.. మైకుపై లైటు కుప్పకూలింది. ఒకవేళ ఆ లైటు ఎంపీపై పడుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు సహా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.  
 
ముఖ్యంగా ఆ భారీ స్టేజ్ లైట్ ఒక్కసారిగా ఎంపీ రాజాపైకి దూసుకురాగా.. ముందుగానే విషయం గుర్తించిన ఆయన ఒక్కసారిగా పక్కకు జరిగారు. అలా ఆయన జరిగిన కొన్ని సెకన్లలోనే లైట్ మైక్‌పై పడింది. దీంతో మైక్ విరగడంతో పాటు.. అక్కడి స్టేజీ కూడా అటూ ఇటూ కదిలింది. ఇలా తృటిలోనే ఎంపీ రాజా ఈ ప్రమాదం నుంచి బయట పడగా.. పార్టీ శ్రేణులు, ప్రజలంతా ఊపిరి పీల్చున్నారు. 

తమిళనాడు డీఎంకే ఎంపీకి తప్పిన ప్రమాదం

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో డీఎంకే ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో గాలిదుమారానికి వేదిక పై పడ్డ లైటింగ్ స్తంభం

అయితే అది గమనించి ఎంపీ వేగంగా పక్కకు తప్పుకోవడంతో తప్పిన ప్రమాదం pic.twitter.com/r1JoWwIwue

— Telugu Scribe (@TeluguScribe) May 5, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు