పాత ఇనుప వస్తువులే కాదు, చాలా కాలం నేలమీద, మురికి ప్రదేశాల్లో ఉన్న ముళ్లు గుచ్చుకున్నా, పాత కర్రముక్కలు గుచ్చుకున్నా కూడా సెప్టిక్ అవుతుంది. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, చెక్క ముక్క సందుల్లో, ముళ్ల పొదల మూలల్లో నీటి ఆవిరి, దుమ్ము పేరుకుంటాయి.
అందువల్ల పుండు (septic) అవుతుంది. నిజానికి చెత్త కుండీల్లో ఉన్న కాగితాలు, మురికి రోడ్డు మీది మట్టికణాలు రక్తాన్ని చేరుకున్నా ఇలాగే సెప్టిక్ అయ్యే అవకాశం ఉంది. అయితే అవి గుచ్చుకోవు కాబట్టి ప్రమాదం ఉండదు.