మద్యం సేవించి రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన వ్యక్తి అరెస్టు

శుక్రవారం, 21 జులై 2023 (18:02 IST)
కేరళ రాష్ట్రంలోని కన్నూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని కన్నూరుకు చెందిన జయప్రకాశన్‌(48)గా గుర్తించినట్టు కేరళ పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఈ నెల 18వ తేదీ రాత్రి సమయంలో జరిగహింది. 
 
జయప్రకాశన్ రోడ్డు కారును నడుపుకుంటూ వెళుతూ సిటీ లోపల ఉన్న రైల్వే ట్రాక్‌పైకి కారు పోనివ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని వెల్లడించిన పోలీసులు.. రైల్వే ట్రాక్‌ను అడ్డరోడ్డు అని తప్పుగా అనుకొని కారు నడిపినట్టు తెలుస్తోందన్నారు. 
 
అయితే, ఆ కారు కొన్ని మీటర్ల వరకు ట్రాక్‌పై వెళ్లి తర్వాత పట్టాలపై ఇరుక్కుపోయిందని పోలీసులు తెలిపారు. దీంతో రైల్వే గేట్‌ కీపర్‌, స్థానికులు పోలీసులకు, సమీపంలోని రైల్వే స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. 
 
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జులై 19న అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బెయిల్‌పై అతడిని విడుదల చేయడానికి ముందు కారును సీజ్‌ చేశారు. కారు పట్టాలపై ఉన్న సమయంలో రైళ్లు రాకపోవడంతో అతడి ప్రాణాలకు ముప్పు తప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు