ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

ఠాగూర్

గురువారం, 3 జులై 2025 (15:35 IST)
ముంబై మహానగరంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి తాము నివసించే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి చేయడమే ఇందుకు కారణమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైలోని కండివాలి అనే ప్రాంతానికి చెందిన పంత్ ఆర్తి మక్వానా (14) అనే బాలుడుని అతని తల్లి బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో ట్యూషన్‌కు వెళ్లమని చెప్పింది. అయితే, ట్యూషన్‌కు వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టంలేని పంత్... తల్లి ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుంచి అయిష్టంగానే బయటకు వెళ్లాడు.
 
తల్లి మాత్రం తన బిడ్డ ట్యూషన్‌కు వెళ్లాడని భావించింది. కానీ, కొద్ది నిమిషాలకో వారి అపార్టుమెంట్ వాచ్‌మెన్ పరుగున వచ్చి.. పంత్ భవనం పైనుంచి పడిపోయాడని చెప్పాడు. ఈ వార్త విన్న తల్లి వెంటనే కిందకు వెళ్లి చూడగా, తన కుమారుడు రక్తపు మడుగులో పడివుండటం చూసి షాక్‌కు గురై, అక్కడే అపస్మారకస్థితిలో పడిపోయింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదువులు ఒత్తిడి కారణంగానే విద్యార్థి ఈ తీవ్ర నిర్ణయం తీసుకునివుంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు