భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఢిల్లీలో అక్రమంగా మందులు నిల్వచేసినట్టు తేలింది. దీంతో ఆయన్ను ఈ కేసులో దోషిగా తేలారు. ముఖ్యంగా, కరోనా రోగులకు ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను పంచిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్‌లో డ్రగ్ కంట్రోలర్ విచారణ చేపట్టింది. గౌతం గంభీర్ ఫౌండేషన్ మత్రం అక్రమ రీతిలో ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను నిల్వ చేసిందని, ఈకేసులో గంభీర్ ఫౌండేషన్ దోషిగా తేలినట్లు ఢిల్లీ హైకోర్టుకు ఆ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ శాక పేర్కొంది.
ఈ కేసులో డ్రగ్ కంట్రోలర్ తరపున అడ్వకేట్ నందితా రావు వాదించారు. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ కింద గంభీర్ ఫౌండేషన్ నేరం చేసినట్లు అడ్వకేట్ తెలిపారు. ఇదే యాక్ట్ ప్రకారం ఆప్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ కూడా దోషిగా తేలినట్లు ఆమె తెలిపారు. దోషిగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు డీజీసీఐని ఆదేశించింది. ఈ కేసులో మళ్లీ జూలై 29న విచారణ జరగనున్నది.
కరోనా వైరస్‌తో బాధపడుతున్న పాజిటివ్ పేషెంట్లకు ఆయన ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను ఇచ్చారు. దీనిపై కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలైంది. తాను పంపిణీ చేసిన మందులు అత్యవసరమైనవని, వేల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు చేసినా.. తాను మాత్రం ప్రాణాలు రక్షించేందుకు ప్రజాసేవ చేస్తూనే ఉంటానని ఇటీవల గంభీర్ కూడా స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ గంభీర్ అక్రమ రీతిలో ఫాబీప్లూ మందులను భారీ సంఖ్యలో సేకరించినట్లు పిల్‌లో ఆరోపించారు. దీనిపపై విచారణ చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు.. డ్రగ్స్ కంట్రోల్‌ను ఆదేశించింది. పిల్ అంశంలో జస్టిస్ విపిన్ సింగ్ స్పందిస్తూ సరఫరా ఎక్కువగా లేని ఆ ఔషధాన్ని గంభీర్ ఎలా ప్రొక్యూర్ చేశారని, ఆయన ఉద్దేశం మంచిదే అయినా.. కానీ ఇది ఎంత వరకు సమంజసమైన ప్రవర్తన అని జస్టిస్ ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఢిల్లీ పోలీసుల నివేదిక ప్రకారం.. ఎంపీ గంభీర్ సుమారు 2862 ఫాబీఫ్లూ స్ట్రిప్పులను కొనుగోలు చేశాడు. గార్గ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సంజయ్ గార్గ్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం గంభీర్ ఫాబ్లీ ఫ్లూ ట్యాబ్లెట్లను తెప్పించాడు. అయితే అంత భారీ మొత్తంలో ఓ కెమిస్ట్ ఎలా ఆ మందులను అమ్మినట్లు గతంలో కోర్టు ప్రశ్నించింది. దీపిక్ సింగ్ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ ఈ ప్రశ్నలు వేసింది.