యువకుడిపై మొసలి దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మొసలి దాడిలో చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పద్రా తాలూకాలోని సోఖ్దారఘు గ్రామానికి సమీపంలో ధధర్ నదిలో ఇమ్రాన్ దివాన్ (30) అనే వ్యక్తి స్నానానికి దిగాడు.