టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు మహిళల ఆదరణ మామూలుగా లేదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా కొండ మాట్లాడే తీరు, అతడి డైలాగ్ డెలివరీకి ఫిదా అయిపోతున్నారు. సోమవారం సాయంత్రం గుజరాత్ పరూల్ యూనివర్శిటీలో లైగర్ టీమ్‌కు బ్రహ్మరథం పట్టారు. విజయ్ దేవరకొండకు మహిళలు భారీ పూలమాలతో సత్కరించారు. ఓ దశలో ఓ అభిమాని అతన్ని కౌగిలించుకుని ఆనందబాష్పాలతో ఏడ్చేసింది. తనంటే పిచ్చి అన్నంతగా బిహేవ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.