పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు.. హైకోర్టు సీరియస్ (Video)

ఠాగూర్

మంగళవారం, 7 జనవరి 2025 (19:20 IST)
కొందరు సఫారీ వాహనాల్లో పర్యాటక ప్రాంతానికి వెళ్లి పులిని చుట్టుముట్టారు. తామేదో ఘనకార్యం చేసినట్టుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో కోర్టు దృష్టికి వెళ్ళింది. దీంతో ఆ సఫారీ వాహనాల్లో వెళ్లి పులి, పులి పిల్లలను చుట్టుముట్టిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
మహారాష్ట్రలోని ఉమ్రేడ్ - పౌని - కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో పిల్లలతో ఉన్న పులిని సఫారీ వాహనాల్లో వెళ్లిన కొందరు చుట్టుముట్టారు. ఈ పర్యాటకులను చూసిన పులి, పులి పిల్లలు భయాందోళన చెందాయి. ఈ వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, ఈ ఘటనపై విచారణకు కోర్టు ఆదేశించింది. 

 

పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు.. హైకోర్టు సీరియస్

మహారాష్ట్రలోని ఉమ్రేడ్-పౌని-కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో పిల్లలతో ఉన్న పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు

పర్యాటకులను చూసి భయాందోళన చెందిన పులి

ఈ వీడియో వైరల్ కావడంతో సీరియస్ అయిన మహారాష్ట్ర హైకోర్టు

ఈ ఘటనపై విచారణకు… pic.twitter.com/VP8Kd7mFWe

— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు