పానీపూరి, సమోసాలు అంటే ఇష్టపడనివారుండరు. వీటి పేరు వింటేనే నోటిలో లాలాజలం ఊరుతుంది. అయితే, సమోసాలకు కూడా సీరియల్ నంబర్ ఇవ్వడం ఎక్కడైనా చూశారు. కానీ, ఢిల్లీలో ఓ వ్యక్తి ఆర్డరిచ్చిన సమోసాలపై సీరియల్ నంబర్‌తో సరఫరా చేయడం గమనార్హం.
ఢిల్లీకి చెందిన నితిన్ మిశ్రా అనే వ్యక్తి ఓ దుకారణంలో సమోసాలకు ఆర్డరిచ్చాడు. దీంతో అతని ఇంటికి సమోసాలు సరఫరా అయ్యాయి. అయితే, వాటిపై క్రమ సంఖ్య ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఫొటోతో సహా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
నెటిజన్లు దీనిపై పలు కామెంట్లు చేశారు. సమోసాలకు నంబర్ల విధానం కొనసాగడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అవి ప్రముఖ ఈటరీ సమోసా పార్టీకి చెందినవి అంటూ ఒకరు బదులిచ్చారు. ఆ ఈటరీ సమోసాలకు సీరియల్ నంబర్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.