మహిళలపై వయోబేధం లేకుండా, వావి వరుసలు లేకుండా లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు తగ్గట్లేదు. తాజాగా ఆరేళ్ల బాలికపై ఆమె తాతయ్య, మేనమామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది.
ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదైంది. కొద్దిరోజుల కిందట తన మేనమామ సమోసాలు ఇస్తానని తనను, తన సోదరుడిని బంధువుల ఇంటికి తీసుకువెళ్లాడని, అక్కడ అప్పటికే తాత ఉన్నాడని బాధితురాలు పేర్కొంది.