రాసలీలల ఆధారాలు బయటపెడతా... బాధిత మహిళ -మేటికి మళ్లీ తలనొప్పి

బుధవారం, 19 జులై 2017 (12:46 IST)
కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి మేటి రాసలీలల వీడియోలో కనిపించిన బాధిత మహిళ పూటకో తీరు మాట్లాడుతోంది. రాసలీలల వీడియో వెలుగులోకి వచ్చాక మేటి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు జరిపిన విచారణలో మేటి తనకు తండ్రి లాంటి వాడని సదరు బాధిత మహిళ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని ఓ జిల్లా ఆయుర్వేద ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై అటెండరుగా పనిచేస్తున్న బాధిత మహిళ గత ఏడాది డిసెంబరు నెల నుంచి సెలవులో ఉన్నారు. 
 
సుధీర్ఘకాలం సెలవు అనంతరం విధుల్లో చేరేందుకు బాధిత మహిళ రావడంతో ఆసుపత్రి అధికారులు ఆమెను విధుల్లో చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన మహిళ రాసలీలలపై మళ్లీ మాట మార్చింది. తన వద్ద కీలక డాక్యుమెంట్లు ఉన్నాయని.. తనకు న్యాయం జరగని పక్షంలో వాటిని బయటపెడతానని హెచ్చరించారు. రాసలీలలకు సంబంధించి మరిన్ని ఆధారాలు త్వరలో బయటపెడతానని బాధిత మహిళ ప్రకటించడం కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది.

వెబ్దునియా పై చదవండి