My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

సెల్వి

శనివారం, 10 మే 2025 (15:16 IST)
My Sindoor to Border
పెళ్లైన మూడు రోజులకే ఆ నవ వధువు తన సింధూరం గురించి కూడా లెక్క చేయకుండా భారత సరిహద్దులకు తన భర్తను పంపింది. ఆమె భర్త ఎవరో కాదు ఆర్మీ జవాన్. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో త్రివిధ దళాల్లో ఉన్నవారి సెలవుల్ని రద్దు చేసింది. 
 
అంతే కేకుండా.. దేశంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని జలగావ్‌లో ఒక నవవధువు పెళ్లైన మూడు రోజులకే తన భర్తను యుద్దానికి పంపింది. 
 
పచోరా తాలూకా పుంగావోన్‌కి చెందిన మనోజ్ దన్వేశ్వర్ ఆర్మీలో సైనికుడు. యామినికి, మనోజ్‌కు ఈ నెల 5న పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా దేశం కోసం తన సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నానని నవ వధువు భావోద్వేగానికి లోనైంది. ఇలా నవ వధువు కంట తడి పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
పెళ్లి చేసుకుని కనీసం మూడు రోజులు కూడా గడవక ముందే.. భర్తను ఆ ఇల్లాలు.. సరిహద్దుకు పంపడం పట్ల నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Just married on May 5. By May 8, he was at the border.

As he left, she said...

'I’m sending my sindoor to the nation.'

This is Yamini. A soldier’s bride. A nation’s pride.

Jai Hind ???????? #IndiaPakistanWar #IndianArmy#Pakistan #IndianAirForce #IndiaPakistan #OperationSindoor pic.twitter.com/84mYng1FbJ

— Aman Mishra (@twisamar7) May 10, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు