సెల్ఫీ డెత్‌లలో భారతీయులే అధికంగా ఉంటున్నారట...

శుక్రవారం, 28 జూన్ 2019 (15:38 IST)
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఎవరి చేతులో చూసిన స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తోంది. అంతేకాకుండా సెల్ఫీల పిచ్చి కూడా బాగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సెల్ఫీలకు బానిసలవుతున్నారు. దీంతో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీల మోజులో పడి చనిపోయిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారట.
 
ఇదే విషయాన్ని భారత్‌కు చెందిన ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ జర్నల్ వెల్లడించింది. సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు నీటిలో మునిపోవడం, వాహన ప్రమాదాలకు గురవడం, ఎత్తైన ప్రదేశాల నుండి కిందికి పడిపోవడం లాంటివి జరగడం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారని ఆ జర్నల్ తెలిపింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా షార్కు చేపల దాడిలో ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య కంటే సెల్ఫీల కారణంగా చనిపోయిన వారి సంఖ్యే అధికంగా ఉందని ఆ సర్వే తేల్చింది. సెల్ఫీల మరణాలు పెరుగుతుండటంతో ముంబై ప్రభుత్వం 16 ప్రాంతాల్లో ఫోటోలు తీసుకోవడంపై నిషేధం విధించిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు