భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం: ఢిల్లీ నుంచి జైపూర్‌కి 30 నిమిషాల్లో...

ఐవీఆర్

మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (13:36 IST)
ఆ రైలులో ఢిల్లీ నుండి జైపూర్‌కు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధంగా ఉంది. హైపర్ లూప్ అనేది సుదూర ప్రయాణానికి హై-స్పీడ్ రవాణా వ్యవస్థ. ఐఐటీ మద్రాస్ 422 మీటర్ల పొడవైన టెస్ట్ ట్రాక్‌ను అభివృద్ధి చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ మద్దతుతో ఐఐటీ మద్రాస్, భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్‌ను 422 మీటర్ల పొడవుతో అభివృద్ధి చేసింది. ఈ టెస్ట్ ట్రాక్ ఫలితం ప్రకారం 350 కి.మీ.లను కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అంటే ఢిల్లీ నుండి జైపూర్‌కు దాదాపు 300 కి.మీ.లను అరగంటలోపే వెళ్లవచ్చు.
 
ఈ వార్తను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలియజేస్తూ, ప్రభుత్వం-విద్యా సహకారం భవిష్యత్ రవాణాలో ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళుతోంది. 422 మీటర్ల మొదటి పాడ్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో చాలా దూరం వెళ్తుంది. మొదటి రెండు గ్రాంట్లకు ఒక్కొక్కటి ఒక మిలియన్ డాలర్ల గ్రాంట్ తర్వాత, హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ఐఐటి మద్రాస్‌కు ఒక మిలియన్ డాలర్ల మూడవ గ్రాంట్ ఇవ్వబడే సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను అని అన్నారు.

The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు