మరోవైపు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలోని జూబ్లీపార్క్ వద్ద నడిరోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు కర్రలతో కొట్టారు. మతిస్థిమితంలేని వ్యక్తిపై పోలీసులు చేజేసుకోవడానికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు స్మార్ట్ ఫోన్ల ద్వారా రికార్డు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మీడియా ఆ పోలీసులను ప్రశ్నించగా... రోడ్డుపై నుంచి పక్కకు పంపడానికి తాము అతడిని భయపెట్టాలని మాత్రమే చూశామని చెప్పుకొచ్చారు.