జల్లికట్టు పోరాటం అదుపుతప్పింది. గత వారంరోజులుగా ఆందోళన చేస్తున్న యువత, విద్యార్థులు, నగర వాసులు సోమవారం బెదిరింపులకు దిగారు. జల్లికట్టు క్రీడా పోటీలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతూ వారు మొండిపట్టుపట్టిన విషయం తెల్సిందే. అంతేనా.. మెరీనా బీచ్ నుంచి తమను వెళ్ళగొట్టాలని చూస్తే సముద్రంలో దూకుతామని బెదిరింపులకు దిగారు. దీంతో మెరీనా తీరం ఉద్రిక్తంగా మారింది.
మెరీనా బీచ్లో ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఖాళీ చేయించాలని చూస్తే, సముద్రం దూకుతామని విద్యార్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు.
శాంతిభద్రతలకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం తలమునకలైంది. ఇదిలావుంటే, తమిళులు చేస్తున్న ఆందోళనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాజకీయసినీ వర్గాలు పూర్థి స్థాయిలో మద్దతు ఉన్న విషయం తెల్సిందే.