అమ్మకేమైందో తెలియని సందిగ్దం. అమ్మ అంటే... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె ఆరోగ్యంపై ఇంకా టెన్షన్ నడుస్తూనే ఉంది. గతవారంలో అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసినా వారం రోజులుగా ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల కాలేదు. ఐతే ఆమె గురించి ఎవరైనా ఏదయినా తేడాగా రాస్తే మటుకు పోలీసులు వెతికి మరీ అరెస్టు చేస్తున్నారు.
కాగా సెప్టెంబరు 22న జయలలిత తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారంటూ అపోలో ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి ఆమె ఆరోగ్యంపైన రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆమె ఆరోగ్యంపైన వాకబు చేశారు. అమ్మకు ఎలాంటి చికిత్స చేస్తున్నారంటూ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఐతే అసలు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపైన ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్లు ఇస్తుంటే తప్పుడు వార్తల ప్రచారానికి వీలు లేకుండా ఉంటుందని కొందరు అంటున్నారు.