హఠాత్తుగా మందు (మద్యం) మానేయలేరనీ, అందువల్ల మద్య నిషేధం కుదరదని సినీ నటుడు, మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. మదురై కేంద్రంగా ఆయన రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెల్సిందే.
ఈనేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించలేమన్నారు. పైగా, అది సమాజానికి మేలు కంటే ఎక్కువగా చేటు చేస్తుందన్నారు. తాను సంపూర్ణ మద్యనిషేధానికి వ్యతిరేకమని ఆయన తేల్చి చెప్పారు.
అలా చేయడంతో ఓ మాఫియా తయారవుతుందన్నారు. అయితే విచ్చలవిడిగా లిక్కర్ షాపులకు పర్మిషన్ ఇవ్వరాదని, మద్య నిషేధం విధించడం.. తర్వాత ఎత్తేయడం మంచిది కాదన్నారు. స్కూళ్ల దగ్గర లిక్కర్ షాపులు ఉండటంపై తాను ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు.