గాలి కుమార్తె వివాహం.. అదిరిపోయే ఆంధ్రా స్టైల్ వంటకాలు.. రూ.650కోట్లు ఖర్చు నిజమేనా?

గురువారం, 17 నవంబరు 2016 (10:55 IST)
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి విచ్చేసిన అతిథుల కోసం అదిరిపోయే ఆంధ్రా స్టైల్ భోజనాలు వండించారు. పెళ్లికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం ఎదురుకాకుండా చూసుకున్నారు. కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్, గోల్డన్ స్టార్ గణేష్, అలనాటి నటి జయంతి, శరత్ బాబు, సుమన్, శ్రీనాథ్ తమిళనాడు, ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, కర్ణాటక రెడ్డి జనసంఘం నాయకులు గాలి ఇంట జరిగిన పెళ్లికి హాజరయ్యారు.
 
ఈ నేపథ్యంలో మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి కోసం జనార్థన రెడ్డి భారీగా ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో, బెంగళూరుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ టి.నరసింహమూర్తి ఈ పెళ్లి ఖర్చులకు సంబంధించి ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. మొత్తం 4 పేజీల ఫిర్యాదులో గాలి జనార్దన్ రెడ్డి పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను ఎగవేశారని నరసింహమూర్తి ఆరోపించారు. 
 
కూతురి పెళ్లి కోసం గాలి దాదాపు 650 కోట్లు ఖర్చు చేశారన్నారు. దీంతో ఈ పెళ్ళి ఖర్చులపై ఆరా తీసేందుకు ఐటీ శాఖ సిద్ధమైంది. అయితే కూతురి పెళ్ళిపై ఐటీ శాఖ జరిపే దర్యాప్తుకు సహకరిస్తానని ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి