కేసు విచారణలో భాగంగా, హులిగమ్మకు అక్రమ సంబంధం ఉందనే విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే సిద్ధలింగప్పను అదుపులోకి తీసుకుని విచారించగా అతను నిజాన్ని ఒప్పుకున్నాడు. బుధవారం పొలం వద్దకు వెళ్లి హులిగమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేయించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించారు.