ఎన్ని ఆస్పత్రులు సంప్రదించినా ఫలితం దొరకలేదు. ఓపెన్ సర్జరీ తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తేల్చేశారు. డాక్టర్ సురక్షిత్ బత్తినను సంప్రదించగా ఆయన ట్రూ 3డీ ల్యాపరోస్కోపీతో 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. 8 గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టార్ సురక్షిత్ బత్తిన. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సాధించారు. కాగా సురక్షిత్ బత్తిన చెన్నైలో నివసించే ప్రసిద్ధ గైనకాలజిస్ట్. అన్నా నగర్లోని ఇండిగో ఉమెన్స్ సెంటర్ వ్యవస్థాపకుడు.
ఇప్పటివరకు, డాక్టర్ బత్తిన 10,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు చేశారు. మహిళల ఆరోగ్య సంరక్షణలో ఆయన చేసిన కృషికి 40కి పైగా అవార్డులను అందుకున్నారు. ఆయన క్లినిక్ రోగులకు గొప్ప శ్రద్ధ, భద్రతతో చికిత్స చేయడానికి ఆధునిక పద్ధతులను ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందింది.