పడకగదిలో రహస్యంగా డీవీఆర్ వుంచిన భర్త విడాకులు తీసుకోవడంలో గెలిచాడు. అతను ఊళ్లో లేనప్పుడు ఆమె ఫ్రెండ్స్‌లో ఒకడు ఆ ఇంటికి వచ్చాడు. ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇదంతా డీవీఆర్‌లోని డీవీడీలో రికార్డైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ భర్త బళ్లారి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఇలా బెడ్‌రూంలో వీడియో రికార్డర్ పెట్టడాన్ని తప్పుపట్టిన కోర్టు, సాక్ష్యాధారాలు వీడియో బలంగా ఉండటంతో విడాకులకు ఓకే చెప్పింది.
కానీ కింది కోర్టు తీర్పును ఆమె 2013 జులై 30న పైకోర్టులో (హైకోర్టులో) సవాల్ చేశారు. తన భర్తకు పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ తీసే అలవాటు ఉందన్న ఆమె... తనను బలవంతంగా అలాంటి వాటిలో నటించేలా చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ వీడియోలో ఉన్నది కూడా అలాంటిదే అన్నారు. తన భర్త బెంగళూరు వెళ్లలేదనీ... ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అందువల్ల విడాకులు ఇవ్వాలన్న కింది కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరారు.