కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ ఎంపీ.. విమర్శలకు మరింత పదును

సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:27 IST)
సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో కూడా వలస రాజకీయాలు జోరందుకున్నాయి. బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీహార్‌ ధబాంగ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఈయన ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. నిజానిక ఈయన గత శుక్రవారమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక సోమవారానికి వాయిదా వేసింది. 
 
కీర్తి అజాద్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ 2015 డిసెంబరులో పార్టీ నుంచీ బీజేపీ సస్పెండ్ చేసింది. అప్పట్లో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేయగా... ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు