ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన యువతి లా విద్యాభ్యాసం చేసింది. ఇంటర్న్‌షిప్ కూడా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఆనందాన్ని తన బంధువైన ఫలాహరీ బాబాతో పంచుకుందామని అదేపట్టణంలో ఉన్న ఫలాహారీ బాబా దగ్గరకు వెళ్లింది. పూజలో ఉన్న బాబాను కలిసేందుకు అతని గదిలోకి వెళ్లింది.
హారతి కార్యక్రమం పూర్తి కావడంతో గదిలోకి వచ్చిన బాబా, యువతిని చూసి తలుపుగడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు. దీంతో యువతి అవమానభారంతో ఢిల్లీలోని తన సోదరుడి దగ్గరకు చేరుకుని జరిగింది వివరించింది. దీంతో అతను తన సోదరిని తీసుకుని బిలాస్పూర్ చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.