ప్రేమకు కళ్లు లేవు గుడ్డిది అంటారు. అయితే కళ్లు మాత్రమే కాదు వయసుతో కూడా సంబంధం లేదని.. ఈ జంట నిరూపించారు. వివాహమైనా... ఇద్దరు పిల్లలు కలిగినా.. ఆపై వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కానీ ఆ ప్రేమకు సమాజం అక్రమ సంబంధం అని పేరు పెట్టడంతో పాటు.. నానా రకాలుగా మాటలతో దెప్పిపొడిచింది. చివరికి తమ ప్రేమను బతికించుకునేందుకు ఆ ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవసరి జిల్లా బిలిమొర ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సురిబుజర్గలో 25 ఏళ్ల రంజిత్ జుగ తన కుటుంబంతో అమ్లాసద్ సొసైటీలో నివసిస్తున్నాడు. ఇదే సొసైటీలో స్వాతి భాలియా అనే మరో మహిళ కూడా భర్తతో కలిసి నివసిస్తుంది. రంజిత్, స్వాతిలకు ఇప్పటికే వివాహమైంది. ఇద్దరికీ పిల్లలున్నారు.
ఈ నేపథ్యంలో రంజిత్, స్వాతి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పదినెలలుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమాయాణం గురించి సొసైటీ మొత్తం తెలిసిపోయింది. అయితే ఇంట్లో వారు వారిద్దరికీ షరతులు పెట్టారు.