అయితే అటువంటి కన్‌సైన్‌మెంట్ ఏదీ లేదంటూ కొన్ని నకిలీ బిల్లులు సృష్టించి, మహరాజ్‌ను ఆమె మోసం చేశారని విచారణలో తేలింది. ఈకేసు విచారణ 2015లోనే ప్రారంభమయ్యింది. ఆమె ఈ ఉదంతంలో... లేని కన్‌సైన్‌మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్‌లు, డాక్యుమెంట్లు తయారు చేశారని తేలింది.
ఈ కేసులో అరెస్ట్ అయిన ఆమె... 50 వేల ర్యాండ్లు పూచీకత్తుగా చెల్లించి, బెయిల్‌పై విడుదలయ్యారు. 2015 ఆగస్టులో ఆశిష్ లతా... మహరాజ్‌ను కలిశారు. తాను సౌత్ ఆఫ్రికన్ హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం మూడు కంటైనర్ల లైనెన్‌ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆమె మహరాజ్‌కు తెలిపారు.