ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజమండ్రి జైల్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి నరేంద్రను తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా ఈసారి ఆసుపత్రి నుంచి జైలుకు తరలించవద్దని ACB కోర్ట్ ఆదేశించింది. తమకు సమాచారం ఇవ్వకుండా నరేంద్రను జైలుకు తరలించడంపై పోలీసులపై ఏసిబి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.